- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, ఆదిలాబాద్ : అమాయక ప్రజలను వేధిస్తూ దౌర్జన్యంతో డబ్బులు వసూలు చేసే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కేడీలను ఉక్కు పాదంతో అణచివేసే చర్యలను జిల్లా పోలీసు యంత్రాంగం

దిశ, ఆదిలాబాద్ : అమాయక ప్రజలను వేధిస్తూ దౌర్జన్యంతో డబ్బులు వసూలు చేసే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కేడీలను ఉక్కు పాదంతో అణచివేసే చర్యలను జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ సబ్ డివిషనల్ అధికారులతో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో, ఉట్నూర్ సబ్ డివిజనల్ అధికారులతో ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో వేరువేరుగా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా..ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మాణానికి ప్రతి ఒక్క పోలీసు పూర్తి స్థాయిలో కృషి చేయాలని సూచించారు. ఈ సంవత్సరం జిల్లాలో దాదాపు 141 కేసులలో 290 మంది నిందితులను అరెస్టు చేయగా.. వారి వద్ద నుంచి దాదాపు 40 కిలోల గంజాయి 2200 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా చేసినా.. పండించినా, వ్యాపారం చేసినా, సేవించిన చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో రౌడీలు సస్పెక్ట్ లు ప్రతివారం తనిఖీ చేస్తూ వారి కదలికలను పరిశీలించాలని, ఎలాంటి సందర్భంలోనైనా అమాయకులను, ప్రజలను హింసించిన, మోసం చేసిన, దౌర్జన్యం చేసిన వారిపై తగు చర్యలు తప్పవన్నారు. జిల్లాలో నమోదైన రౌడీ షీటర్లు ఎలాంటి నేరాలలో పాల్గొనకుండా, సత్ప్రవర్తనతో ఉన్న వారిపై రౌడీ షీట్లు ఎత్తివేసే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్,పట్టణ సిఐలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అన్ని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలు సిబ్బంది పాల్గొన్నారు.






