ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

by Chintha Aamani |

చేనేత వస్త్రాలను ధరించి, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. 1

ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
X

దిశ,ఆసిఫాబాద్ : చేనేత వస్త్రాలను ధరించి, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టరేట్ లో బెజ్జూర్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంస్థ- కోసిని, గోదావరిఖని వారిచే ఏర్పాటుచేసిన విక్రయ స్టాల్స్ ను ప్రారంభించారు. చేనేత వస్త్రాలను ధరించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని,చేనేత వస్త్రాలు పూర్తిగా నాణ్యతతో ఉంటాయని, రాయితీ సైతం పొందవచ్చని చెప్పారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్, హనీ స్టాల్స్ ను పరిశీలించి నాణ్యమైన పదార్థాలను విక్రయించాలని సూచించారు.

తర్వాత కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ,డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రాద్ధ శుక్లా, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, గురుకుల ఆశ్రమ వసతి గృహాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను నిర్ణీత సమయంలో నమూనా తయారు చేసి,మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు చిర్రకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకును శాఖను ప్రారంభించారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలనీ. ఇందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Next Story