సోషల్ మీడియా వార్.. బీఆర్ఎస్ నాయకుడి పై కాంగ్రెస్ నాయకుల దాడి

by Jakkula.Mamatha |

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో సోషల్ మీడియా వార్ ఉద్రిక్తతకు దారితీసింది.

సోషల్ మీడియా వార్.. బీఆర్ఎస్ నాయకుడి పై కాంగ్రెస్ నాయకుల దాడి
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో సోషల్ మీడియా వార్ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుంకరి గోపాల్ పై, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆదివారం రాత్రి దాడి చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. భీమారం మండలం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుంకరి గోపాల్ సోషల్ మీడియా వారియర్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుల ద్వారా ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి దిగినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. భీమారం గ్రామపంచాయతీ నిధులు సర్పంచ్ అనుచరుల, కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story