“ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇవ్వగలవా?”.. కోనప్ప, హరిష్ బాబుకు ఘాటు సవాల్

by Bhanu |

తూర్పు నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది.

“ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇవ్వగలవా?”.. కోనప్ప, హరిష్ బాబుకు ఘాటు సవాల్
X

దిశ, ఆసిఫాబాద్ : తూర్పు నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తుమ్మడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం అంశంపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సవాల్ విసిరారు. ఆయన నది ఒడ్డున కూర్చుని “తెలుసుకుందాం” అంటూ కోనప్పను పిలువడం గమనార్హం. ఈ క్రమంలో ఉదయం తుమ్మడి హెట్టి ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కోనప్పను అనుచరులు మరియు కార్యకర్తలు ఇండ్ల వద్దకు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఇరువర్గాల ప్రధాన నాయకులతో చర్చలు జరిపి ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు, మాజీ మంత్రి కోనప్పలను గృహ నిర్బంధంలో ఉంచారు. అయినా ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు పోలీసులను అడ్డుకొని తప్పించుకుని బయటకు వచ్చారు.

పాల్వాయి హరిష్ బాబు

“కోనప్ప సిర్పూర్ నియోజకవర్గానికి పదేళ్ల పాలనలో చేసిన పనేమీ లేదు. తుమ్మడి హెట్టి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు. ప్రాజెక్టును కాళేశ్వరం తరలించి తూర్పు ఆదిలాబాద్‌ను ఎడారిగా మార్చిన ఘనత కోనప్పదే. నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కూడా కోనప్పనే. అందుకే ప్రజలు ఆయన్ను ఓడించారు” అని హరిష్ బాబు అన్నారు. తుమ్మడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను వెంటనే పూర్తి చేసి నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

కోనప్ప ప్రతిస్పందన

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ “తుమ్మడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది నీ తల్లే. దానికి సంబంధించిన ఆధారాలు మీడియా వద్ద ఉన్నాయి. నీకు చేతనైతే తుమ్మడి హెట్టి నిర్మాణం పూర్తి చేసి నీళ్లు ఇచ్చి చూపించు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Next Story