అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం...

by Taduka Kalyani |

అకాల వర్షానికి వరి రైతులు అరిగోస పడుతున్నారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, జోహార్ పూర్, వాస్తాపూర్, ధర్మోరా ,పంచగుడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది.

అకాల వర్షానికి వరి పంటకు తీవ్ర నష్టం...
X

దిశ ,లోకేశ్వరం: అకాల వర్షానికి వరి రైతులు అరిగోస పడుతున్నారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, జోహార్ పూర్, వాస్తాపూర్, ధర్మోరా ,పంచగుడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. వరి కంకి పాలు పోసుకునే దశలో ఉండడం వల్ల నేలకొరగడంతో తీవ్ర నష్టం వాటిల్లే ఆస్కారం ఉన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.20,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, దీనితో సగం దిగుబడులు తగ్గిపోయేలా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

నష్టం వివరాలు సేకరించాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు...
(మండల వ్యవసాయ శాఖ అధికారి గిరిరాజ్)

సోమవారం అర్ధరాత్రి మండలంలోని వివిధ గ్రామాల్లో అకాల వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో కోత దశలో ఉన్న మొక్కజొన్న పంటకు ఎలాంటి నష్టం వాటిల్లే ఆస్కారం లేదు. కానీ ముందుగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో మాత్రం వరి పైరు నేలకు ఒరిగింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. నష్టం వివరాలు అంచనా వేయాలని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ఆదేశాలు వస్తే వివరాలు సేకరించి నివేదికలు ఉన్నతాధికారులకు పంపిస్తాం.

Next Story