- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉట్నూర్ లో ఇసుక బజార్ ఏర్పాటు
దిశ, ఉట్నూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉట్నూర్ లోనీ జీసీసీ కార్యక్రమం సమీపంలో ఇసుక బజార్ ను ఏర్పాటు చేశారు.

దిశ, ఉట్నూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉట్నూర్ లోనీ జీసీసీ కార్యక్రమం సమీపంలో ఇసుక బజార్ ను ఏర్పాటు చేశారు. ఈ బజార్ ఏర్పాటులో జిల్లాలోనే మొదటిది కావడం విశేషం. ఈ బజార్ ను సోమవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్, అధికారులు, నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉట్నూర్ సాండ్ బజార్ ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరం అయ్యే ఇసుక సమస్య తీరినట్లేనన్నారు. టన్ను ఇసుక 12వందలు చెల్లించాలని, ఇసుక కావాల్సిన వారు 155242కి టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని గోపాయి చెరువులో చేప పిల్లలను వదిలారు.






