బడులు సంసిద్ధం.. బడి పిల్లలకు పూర్తి భద్రత: జిల్లా విద్యాదికారి

by Web Desk |
బడులు సంసిద్ధం.. బడి పిల్లలకు పూర్తి భద్రత: జిల్లా విద్యాదికారి
X

దిశ, నిర్మల్ కల్చరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో మంగళవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి డా రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం సోన్ మండలంలోని కడ్తాల్, సోన్ కేజీబీవీ పాఠశాలలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. కరోనా సెలవుల అనంతరం పాఠశాలలకు విద్యార్థులు హాజరువుతున్నందున తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

అలాగే నిబంధనలకు అనుగుణంగా ప్రతి రోజు శానిటైజేషన్ చేపట్టాలని సూచించారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం శుచి, శుభ్రతతో సజావుగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి ణి లత, కడ్తాల్ ప్రధానోపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed