- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నార్నూర్ : రాబోయే స్థానిక సంస్థలల్లో భాగంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ఒకే కుటుంబంలోని ఒకరు సర్పంచ్.. నలుగురు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలంలోని మాలేపూర్ గ్రామపంచాయతీలో 514 ఓట్లు ఉండగా లక్కీ డ్రాలో సర్పంచుగా ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎనిమిది వార్డులకు రెండు ఎస్టీ మహిళలు, రెండు ఎస్టీ జనరల్ గా ఖరారు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే గిరిజన కుటుంబం నివసిస్తుంది. కుటుంబంలో ఆరుగురు ఓటు హక్కును కలిగి ఉన్నారు. కావున ఇప్పడు మాలేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, నాలుగు వార్డులకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఎన్నిక కావడం లాంఛనం అయింది.
Next Story






