గాలి కుంటూ వ్యాధి కార‌ణంగా పాలు కొన‌డం లేదు : సచిన్ దేశ్ పాండే

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాంసి : గాలి కుంటు వ్యాధి కారణంగా నే మన దేశంలో,రాష్ట్రంలో ని పాల ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర గాలి కుంటు వ్యాధి నివారణ

గాలి కుంటూ వ్యాధి కార‌ణంగా పాలు కొన‌డం లేదు : సచిన్ దేశ్ పాండే
X

దిశ, తాంసి : గాలి కుంటు వ్యాధి కారణంగా నే మన దేశంలో,రాష్ట్రంలో ని పాల ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల పరిశీలకులు డాక్టర్ సచిన్ దేశ్ పాండే అన్నారు. శనివారం తాంసి మండల కేంద్రంలోని పశు వైద్య షాలలో నిర్వహిస్తున్న గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని రైతులు, పశు పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.దేశంలోని పలు రాష్ట్రాలలో గాలి కుంటు వ్యాధి విస్తరించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారి రామ రావు రాథోడ్,మండల పశు వైద్య అధికారి శ్రీకాంత్,వెటర్నరీ అసిస్టెంట్ సతిష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story