- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ..!
దిశ, మందమర్రి : రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ ను పారదర్శకంగా పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరిస్తుందని

దిశ, మందమర్రి : రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ ను పారదర్శకంగా పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరిస్తుందని తెలుస్తోంది. మంగళవారం మందమర్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడి మల్ల నర్సింగ్. గతంలో జరిగిన కాళేశ్వరం పుష్కరాలు, మంచిర్యాల లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో కూడా ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అవమానించారని మండిపడ్డారు పట్టణ నేతలు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ పేరును చేర్చకుండా ప్రోటోకాల్ పాటించకూడదని ఎవరు చెప్పారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు. ఎంపీ వంశీకృష్ణ కు పెద్దపల్లి పార్లమెంట్ లో జరుగుతున్న అన్యాయం పై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎర్ర రాజు, ఏడుకొల పవన్, ఎండీ ఇసాక్, సుద్దాల రాజ్ కుమార్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, జావేద్ ఖాన్, మూడరపు శేఖర్, విజయ్, ఖలీల్, మహంతు రవి, మాసు సంతోష్, మాయా తిరుపతి,పోలు సంపత్, చోటు, సతీష్, యాసిన్, సుధాకర్, మల్లేష్ పాల్గొన్నారు.






