గంజాయి సేవించినందుకు రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ అరెస్ట్..

by Bhanu |   (  Updated:2025-04-29 10:08:03  IST  )

గంజాయి సేవించినందుకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రౌడీషీటర్ షేక్ ఇర్ఫాన్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

గంజాయి సేవించినందుకు రౌడీ షీటర్ షేక్ ఇర్ఫాన్ అరెస్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : గంజాయి సేవించినందుకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రౌడీషీటర్ షేక్ ఇర్ఫాన్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రౌడీషీటర్లు, ఆకతాయిలు పబ్లిక్ ప్లేస్ లో, రోడ్లపై సిగరెట్ తాగుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జిబిషన్ వ్యాపారి వద్ద బెదిరించిన నిందితుడు మోసిన్ అరెస్ట్ ను అరెస్టు చేసినట్లు సోమవారం ఆయన డిఎస్పి కార్యాలయం నుంచి తెలియజేశారు. పట్టణంలో గత రాత్రి రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.


అరెస్టు వారిలో మొదటి కేసులో షేక్ ఇర్ఫాన్ మన్నాన్ అనే రౌడీ షీటర్ సిగరెట్ తాగుతూ,రాష్ డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా, అనుమానంతో అతనిపై గంజాయి టెస్ట్ చేయగా, గంజాయి సేవించి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రెండవ కేసులో... అదిలాబాద్ పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఎగ్జిబిషన్ వ్యాపారితో సయ్యద్ మోసిన్ అనే వ్యక్తి డబ్బులు కావాలంటు బెదిరించడంతో అతనిపై కేసు నమోదుతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని తెలిపారు.



Next Story