- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డెక్కిన రైతన్నలు.. పత్తి, సోయా కొనుగోలు చేయాలని డిమాండ్
దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని 44 వ జాతీయ రహదారి పై శనివారం తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా పత్తి, సోయా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు

దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని 44 వ జాతీయ రహదారి పై శనివారం తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా పత్తి, సోయా కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కిసాన్ కపాస్ యాప్ ను తొలగించి పత్తి తేమ శాతాన్ని 12 % నుంచి 20% వరకు పెంచాలి. సోయాబీన్ తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పత్తి ఎకరానికి 7 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని, సోయా ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలన్నారు. అంతేకాకుండా ఇటీవల వర్షాల ప్రభావంతో తడిసిపోయిన పత్తి, సోయా, మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో రెండువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చేంత వరకు నిరసన విరమించమని రైతులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరింపజేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.






