- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోయా పంటను కొనుగోలు చేయాలని ఎమ్మార్వోకు వినతి
దిశ, భైంసా : సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. రాజు డిమాండ్ చేశారు.

దిశ, భైంసా : సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. రాజు డిమాండ్ చేశారు. శనివారం బైంసా మండల తహాశీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైంసా డివిజన్ వ్యాప్తంగా లక్ష ఎకరాల కంటే పైన ఈ ఖరీఫ్ సీజన్ సోయా పంటను రైతాంగం పండించిందని, పండించే సమయంలో కురిసిన విపరీతమైన వర్షాలతో సోయా పంటకు తీవ్రమైన నష్టం జరిగి దిగుబడి కూడా విపరీతంగా తగ్గిందన్నారు. కష్టాలు పడి సోయాను మార్కెట్కు తీసుకొస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు కొనుగోలు దారులు తీవ్రంగా దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ మద్దతు ధర MSP 5328, రూపాయలు ఉండగా మార్కెట్లో ప్రైవేట్ కొనుగోలుదారులు రూ. 4000 నుంచి రూ. 4,500 చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారని, క్వింటాల్ కు వెయ్యి రూపాయలు రైతులు నష్టపోతున్నారని.. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు తడిసి నష్టపోయిన సొయా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దీనాజీ, అంబేద్కర్ సాయినాథ్, గంగారాం, లక్ష్మన్న, భోజన్న పాల్గొన్నారు.






