రైతుల నమోదును పకడ్బందీగా నిర్వహించాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోలు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి

రైతుల నమోదును పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోలు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఏడి మార్కెటింగ్ గజానంద్ పాల్గొన్నారు.

ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్

జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా కలెక్టర్ గోదాంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పర్యవేక్షణ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాల లభ్యత, విద్యుత్ వ్యవస్థ, యంత్రాల నిల్వ విధానం అంశాలను సమీక్షించారు. EVMలు అత్యంత భద్రతతో సంరక్షించబడాలని, గోదాం పరిసర ప్రాంతంలో అనధికారిక ప్రవేశం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story