RBI: ఖాతాదారులకిచ్చే పరిహారాన్ని రూ. 30 లక్షలకు పెంచే యోచనలో ఆర్‌బీఐ

by S Gopi |

అంబుడ్స్‌మన్ పథకాన్ని బలోపేతం చేయడానికి, కస్టమర్ సంతృప్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

RBI: ఖాతాదారులకిచ్చే పరిహారాన్ని రూ. 30 లక్షలకు పెంచే యోచనలో ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక లావాదేవీలు, వివిధ రకాల ఆర్థికేతర సేవలనందించే బ్యాంకుల నుంచి ఏవైనా లావాదేవీలు, సేవలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడినా, లోపాలు ఉన్నా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే వీలుంటుంది. ఇటువంటి కేసుల్లో బ్యాంకింగ్ లోపాల వల్ల ఖాతాదారులు నష్టపోతే వారికి కొంత పరిహారం లభిస్తుంది. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకింగ్ అంబుడ్‌మన్ బాధిత బ్యాంకు కస్టమర్లకు ఇచ్చే పరిహారాన్ని రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించింది. అంబుడ్స్‌మన్ పథకాన్ని బలోపేతం చేయడానికి, కస్టమర్ సంతృప్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పరిహారంతో పాటు ఫిర్యాదు చేసిన‌వారు ఎదుర్కొన్న వేధింపులకు, వెచ్చించిన సమయానికి రూ. 3 లక్షల వరకు అందించే అధికారం కూడా అంబుడ్స్‌మన్‌కు ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుత ఇది రూ. లక్ష వరకు ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకుల కస్టమర్లు నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌తో తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, సాధారణంగా ఫిర్యాదు దాఖలు చేసిన 30 రోజుల వరకు బ్యాంకుల నుంచి ఎలాంటి స్పందన లేని సమయంలోనే వినియోగదారులు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Next Story