టీపీసీసీ చీఫ్ సంచలనం.. పార్టీ నుంచి కీలక నేత సస్పెండ్

by Bhanu |   (  Updated:2025-06-29 10:40:01  IST  )

అసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.

టీపీసీసీ చీఫ్ సంచలనం.. పార్టీ నుంచి కీలక నేత సస్పెండ్
X

దిశ, కాగజ్‌నగర్ రూరల్ : అసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకే ఈ కఠిన చర్య తీసుకున్నట్టు తెలిపారు.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎంపీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అందించిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం రావి శ్రీనివాస్‌పై ఈ చర్య తీసుకున్నారు.

Next Story