రావణాసుర వధకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

by Disha Web Desk 20 |
రావణాసుర వధకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
X

దిశ, బెల్లంపల్లి : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో రావణాసుర వధకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని సింగరేణి తిలక్ స్టేడియంలో భారీ రావణాసుర కటౌట్ ను ఏర్పాటు చేశారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గడిచిన వారం పది రోజుల నుంచి తిలక్ స్టేడియంలో జరుగుతున్నాయి.

రావణాసుర వధను తిలకించడానికి బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ కు లక్ష మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీతోపాటు బెల్లంపల్లి రూరల్, నెన్నల, కన్నెపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూరు,కాసిపేట, చుట్టుపక్క గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాజకీయ పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు.


Next Story

Most Viewed