అరుదైన గాడిద పిల్ల జననం.. జన్మించి కొద్ది నిమిషాల్లోనే మృతి..

by Bhanu |   (  Updated:2025-06-04 15:37:18  IST  )

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలలో బుధవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది.

అరుదైన గాడిద పిల్ల జననం.. జన్మించి కొద్ది నిమిషాల్లోనే మృతి..
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలలో బుధవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన మీనాబాయికి చెందిన గాడిద ప్రసవ వేదనలో బాధపడుతుండడంతో తక్షణమే పశువైద్యశాలకు తరలించారు. పశువైద్యులు గజానన్, దూద్ రామ్ రాథోడ్, గోపి కిషన్ నిర్వహించిన సిజేరియన్ ఆపరేషన్‌లో జన్యు లోపాలతో గల గాడిద పిల్ల జన్మించింది. ఇది పెద్ద తల, చిన్న శరీర భాగాలతో ఉండటంతో పుట్టిన కొద్ది నిమిషాలకే మృతి చెందింది.

అయితే ఈ క్షణంలో గాడిద మాతృజీవితం కీలకంగా మారింది. దాదాపు లక్ష రూపాయల విలువగల ఈ గాడిదను వైద్యులు సమర్థంగా చికిత్స చేసి కాపాడటంతో రైతు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాహసోపేత ఆపరేషన్‌లో సిబ్బంది సాజిద్ అలీ, అమీన్ ఖాజా పాషా, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story