- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ తవ్వకాల్లో బయటపడిన సీతా, రాముల విగ్రహాలు
జన్నారం మండల పరిధిలోని తపాల్ పూర్ చెక్ పోస్టు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా తవ్వకాల్లో పురాతన సీతా,రాముల విగ్రహాలు శుక్రవారం బయటపడ్డాయి.

దిశ, జన్నారం: జన్నారం మండల పరిధిలోని తపాల్ పూర్ చెక్ పోస్టు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా తవ్వకాల్లో పురాతన సీతారాముల విగ్రహాలు శుక్రవారం బయటపడ్డాయి. ఉపాధి హామీ కూలీలు కూలీలు గడ్డపారతో తవ్వుతూ మట్టి తీస్తుండగా వారికి ఓ వింత ఆకారం కనిపించింది. ఏంటా.. అని పూర్తి మట్టిని తవ్వి చూడగా పురాతన సీతా, రాముల విగ్రహాలు కనిపించాయి. వెంటనే విగ్రహాలను వెలికితీసి అక్కడే నీటితో అభిషేకం చేశారు. విగ్రహాలకు పసుపు, కుంకుమ, పూలు పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. విషయాన్ని గ్రామాధికారులకు తెలియజేయగా వారుకూడా వచ్చి విగ్రహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, దొరికిన సీతా, రాముల విగ్రహాలు 1999లో తిమ్మాపూర్ రామాలయం నుంచి దొంగిలించిన విగ్రహాలుగా భావిస్తున్నారు. స్థానిక ప్రజలు మాత్రం విగ్రహాలు లభ్యమైన చోటే రామాలయాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






