ఈ నెల 29న ద్విచక్ర వాహనాలు బహిరంగ వేలం పాట

by Taduka Kalyani |

పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట పరిధిలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 29న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు లక్షెట్టిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 29న ద్విచక్ర వాహనాలు బహిరంగ వేలం పాట
X

దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, లక్షెట్టిపేట పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేయబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలంపాటను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. సమ్మయ్య తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో ఉదయం 10 గంటలకు ఈ వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు పూర్తి వివరాల కోసం లక్షెట్టిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఇన్స్పెక్టర్ సూచించారు.

Next Story