- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ హరిత
పరిశ్రమలలో ప్రమాదాలు జరుగకుండా పరిశ్రమల యజమనులు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు.

దిశ, కాగజ్ నగర్ : పరిశ్రమలలో ప్రమాదాలు జరుగకుండా పరిశ్రమల యజమనులు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ పట్టణం లోని సిర్పూర్ పేపర్ పరిశ్రమను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల రక్షణ పై ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ నిజామాబాద్ డిప్యూటి చీఫ్ ఇన్ స్పెక్టర్ సీ.హెచ్ లక్ష్మి కుమారి ఎస్పిఎంవైస్ ప్రెసిడెంట్ ఎ కే మిశ్రా తో కలిసి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్మాగారాలలో భద్రత ప్రమాణం పాటిస్తూ ప్రమడళ్ళు జరగకుండా యజమన్యులు అప్రమత్తంగా ఉండాలని పరిశ్రమలలో పని చేసే కార్మికుల భద్రత దృష్ట్యా ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అకస్మాత్తు ప్రమాదాలు సంబవిస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలలో నిలువ వుండే క్లోరిన్, యాసిడ్ వంటి విషపూరీత పదార్దాలు లికేజి కాకుండా కట్టు దిట్ట మైన చర్యలు తీసుకోవాలన్నారు. టెక్నికల్ నిపుణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో SPMపరిశ్రమ జనరల్ మేనేజర్ ఎస్. ఎం. గిరి, సేఫ్టి మేనేజర్ ఆర్ శ్రీనివాస్, కమర్షియల్ జి.ఎం. అనిల్ కుమార్ పాల్గొన్నారు.






