నిర్మల్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు

by Ratna Kumari |

నిర్మల్ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. హైదరాబాద్ లోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన చిలుకూరి సాయి తేజ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.

నిర్మల్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, నిర్మల్ ప్రతినిధి : నిర్మల్ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. హైదరాబాద్ లోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన చిలుకూరి సాయి తేజ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. సహచర విద్యార్థి కాజా గౌస్ ఖాన్ తో కలిసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో స్వచ్ఛ భారత్ పాలసీ ద్వారా భారత ప్రజల జీవన ప్రమాణం మరో 10 ఏళ్లు పెంచే అంశంపై ప్రాజెక్ట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2500 కళాశాల నుంచి సుమారు 45 వేల టీములు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సౌత్ జోనల్ ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన ఇరువురి జట్టు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఫైనల్ పోటీల్లో పాల్గొని తమ అంశాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలు పాల్గొన్న ఈ పోటీలలో వీరిద్దరూ జాతీయ స్థాయిలో రెండో బహుమతి పొందారు. వీరికి ప్రైజ్ మనీ గా రెండు లక్షల రూపాయల నగదు ఇద్దరికీ చెరొక లాప్టాప్ బహుకరించారు. పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన చిలుకూరి దేవదాస్, మమతల కుమారుడైన సాయి తేజ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ ఐఏఎస్ అధికారి, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ ఆరాధన పట్నాయక్ చేతుల మీదుగా ఈ అవార్డు పొందారు. భారీ ఎత్తున హాజరైన ఈ పోటీలలో జాతీయస్థాయిలో నిర్మల్ కు చెందిన విద్యార్థి గా రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Next Story