Pranahita River : మళ్లీ ఉప్పొంగుతున్న ప్రాణహిత నది..జలదిగ్బంధంలో మూడు గ్రామాలు

by Chintha Aamani |

ప్రాణహిత నది మళ్లీ పొంగుతుంది.

Pranahita River : మళ్లీ ఉప్పొంగుతున్న ప్రాణహిత నది..జలదిగ్బంధంలో మూడు గ్రామాలు
X

దిశ,బెజ్జూర్ : ప్రాణహిత నది మళ్లీ పొంగుతుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సోమవారం బెజ్జూరు మండలం తలాయి , తిక్క పల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇబ్బంది పడ్డి, వరద బాధితులకు ఊపిరి పీల్చుకునే లోపే సోమవారం మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. బెజ్జూరు మండలం వాసులు మళ్లీ ఇబ్బందులు పడ్డారు. బెజ్జూరు మండలంలోని పాపన్నపేట,తలాయి రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టుల నీటిని ప్రాణహిత నదిలో వదలడంతో బెజ్జూరు మండలం లోని సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలోని పంట పొలాల్లోకి చేరుతుంది. దీంతో బెజ్జూరు మండల రైతులు వేసిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నారు. బెజ్జూరు మండల వాసులకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడనుంది.

Next Story