ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

by Taduka Kalyani |

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ డేటా ఎంట్రీ, నమోదు, శిక్షణ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కారించి, బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story