- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాద్యాయునిగా మారిన పీఓ
దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ ఉపాధ్యాయుడిగా మారాడు. ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయులనీ మారి పాఠాలను బోధించాడు.

దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ ఉపాధ్యాయుడిగా మారాడు. ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయులనీ మారి పాఠాలను బోధించాడు. మంగళవారం ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ మండలంలోని లక్షటిపేట, ఏందా గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. బోధన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలనీ పీఓ సిబ్బందిని ఆదేశించారు. విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు అవసరమైన ఐరన్, సి విటమిన్ టాబ్లెట్లను అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన విద్యార్థులకు ఉదయం స్నానానికి వేడి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.






