- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో PHC సీనియర్ అసిస్టెంట్
by Ratna Kumari |
దిశ, బైంసా : నిర్మల్ జిల్లా బాసర PHC లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ బీమన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కగా

X
దిశ, బైంసా : నిర్మల్ జిల్లా బాసర PHC లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ బీమన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కగా, గురువారం భైంసా పట్టణంలోని ఎన్.బి కాలనీ లోని తన నివాసంలో భీమన్నను అనిషా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. బాసర PHC లో ఫుల్ టైం సీనియర్ అసిస్టెంట్ గా కొనసాగుతున్న భీమన్న, తానూర్ మండలం PHC లో ఇన్ చార్జి సీనియర్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తానూర్ PHC లో పని చేస్తున్న సాయిబాబా తన జీపీఎఫ్, ఎఫ్.టి.ఎఫ్ బిల్లు తయారు చేయడానికి బీమన్న లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో సాయిబాబా సీనియర్ అసిస్టెంట్ కు ఫోన్ పే ద్వారా రూ.9వేలు పంపి, అనీషా అధికారులకు సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అవినీతి శాఖ అధికారులు PHC బాసర తనిఖీలు చేస్తున్నారు.
Next Story






