కొంపముంచిన పురుగుల మందు...ఎండిపోయిన 4 ఎకరాల పత్తి !

by velandi.Saikiran |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైతును పత్తిమందు కొంపముంచింది. వివరాల్లోకి వెళితే.... ఆసిఫ

కొంపముంచిన పురుగుల మందు...ఎండిపోయిన 4 ఎకరాల పత్తి  !
X

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైతును పత్తిమందు కొంపముంచింది. వివరాల్లోకి వెళితే.... ఆసిఫాబాద్ మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లేష్ వారం క్రితం... పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో పత్తి మందును కొనుగోలు చేసాడు. ఈ తరుణంలోనే తన 9 ఎకరాల పత్తికి పిచికారి చేశాడు. అయితే ఆ ఫెస్టిసైడ్ ప్రభావంతో నాలుగు ఎకరాల పత్తిపంట ఎండిపోయింది.

దీంతో ఆ ఫర్టిలైజర్ షాపులో ఆందోళనకు దిగాడు బాధిత రైతు. షాపు యజమాని మాత్రం సంబంధిత కంపెనీకి సమాచారం ఇచ్చి.. పంట పరిశీలించిన తర్వాత పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, పది రోజుల క్రితం ఇదే తరహాలో గొల్లగూడ గ్రామానికి చెందిన రుకుం సాంబయ్య మూడు ఎకరాల పత్తిపంటకు మందు పిచికారి చేయగా, పంట ఎండిపోయింది.

Next Story