కోలాం ఆదివాసీలకు అండగా ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఉట్నూర్ : కోలాం ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని చెరువుగూడలో ఇందిరమ్మ

కోలాం ఆదివాసీలకు అండగా ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్
X

దిశ‌, ఉట్నూర్ : కోలాం ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని చెరువుగూడలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి, 53 ఇళ్ల‌ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. జీవితంలో ఇళ్లు కట్టుకోవడం ఇంటి యజమానికి ఒక కళనని, ఆ కళను రేవంత్ రెడ్డి నేతృత్వంలో నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకవస్తే ఆ సమస్యను పరిష్కరిస్తానన్నారు. దుష్ప్రచారాలను నమ్మి ధర్నాలు చేస్తూ మోసపోవద్దన్నారు. అంతకుముందు బిర్సాయిపేట మాజీ సర్పంచ్ అంకవ్వ, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story