తహసీల్దార్ కార్యాలయంలో స్కానర్ లేక తిప్పలు..

by Disha Web Desk 20 |
తహసీల్దార్ కార్యాలయంలో స్కానర్ లేక తిప్పలు..
X

దిశ, మందమర్రి : మందమర్రి మండల తాసిల్దార్ కార్యాలయంలో స్కానర్ లేక సిబ్బంది ముప్పుతిప్పలు పడుతున్నారంటే అతియోశక్తికాదు. మండల ప్రధాన కార్యాలయంలో కులము, నివాసము, ఆదాయము, ఓబిసి, క్రిమిలేయర్, గ్యాబ్ తదితర ప్రజా, విద్యార్థి పై చదువుల అవసరాలకు ఆయాధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటుంది. అవిట్టి కొరకు దరఖాస్తులు చేసుకొని కార్యాలయం నుండి పొందే క్రమంలో కార్యాలయం కాఫీ స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా కార్యాలయంలో స్కానర్ మొరాయించడంతో సిబ్బంది పై పని భారం పడుతుందని తెలుస్తోంది. రామకృష్ణాపూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సింగరేణి స్థలాలలో గృహాలు నిర్మించుకున్న వారికి పట్టాల జారీ కార్యక్రమం గత సంవత్సరకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం 5 వ దఫా పట్టాల పంపిణీకి 73 జీవో ద్వారా ప్రభుత్వం పట్టాల జారి పనులు వేగవంతంగా సాగుతుంది. కార్యాలయంలో స్కానర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది తమ మొబైల్ ఫోన్ తో స్కానింగ్ చేసి సిస్టంలో భద్రపరచడం తలకు మించిన భారంగా తయారవుతుందని వాపోతున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ నుండి గీర్దావారి, నాయబ్ తాసిల్దార్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మండల సర్వేర్, ధరణి ఆపరేటర్ తదితరులకు కంప్యూటర్ (సిస్టం) స్కానర్లు ఉండవలసిన అవసరం ఉందని సమాచారం. కానీ కార్యాలయంలో ఆరు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కార్యాలయంలో పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story