- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
by Bhanu |
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

X
దిశ, ఆదిలాబాద్: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల పీహెచ్సీ భవనాన్ని సందర్శించినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు.
కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకులు ఆలోచించి మాట్లాడాలని హితువు పలికారు.కేంద్ర ప్రభుత్వం కృషితో ఇప్పటికే జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ,పేషంట్ కేర్ ఆస్పత్రిను ఏర్పాటు చేశామన్నారు.ఇందులో నాయకులు ఇంద్రజిత్, మురళీధర్,రాము,రాకేష్, విజయ్,కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






