పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి : బిఆర్ఎస్

by Ratna Kumari |

దిశ, బోథ్ : మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నష్టపోయిన రైతులకు వెంటనే

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి : బిఆర్ఎస్
X

దిశ, బోథ్ : మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆదివారం బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతుండడంతో పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆందోళనలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా అడవి పందుల వలన నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం వెంటనే రీ సర్వే చేసి ఎకరానికి 25 వేల నష్టపరిహారం అందించాలని రైతుల తరఫున బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, సుభాష్, ప్రవీణ్ పాల్గొన్నారు.

Next Story