- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్లు త్రాగేదెలా మహాప్రబో..!!
by Batti.Sumithra |
బైంసా ఆర్టీసీ బస్టాండ్ లో చల్లనినీరు తాగేందుకు ఫ్రిజ్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. నీళ్లు ఎలా త్రాగాలే మహాప్రభూ అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

X
దిశ, కుబీర్ : బైంసా ఆర్టీసీ బస్టాండ్ లో చల్లనినీరు తాగేందుకు ఫ్రిజ్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. నీళ్లు ఎలా త్రాగాలే మహాప్రభూ అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసులైన ఏర్పాటు చేయకపోవడంతో తాగేందుకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాటర్ ఫ్రిజ్ నల్లవద్ద చేతులు పెట్టి తలవంచి ప్రయాణికులు నీళ్లు తాగే పరిస్థితి ఏర్పడింది.
చిన్నపిల్లలకు నీళ్లు త్రాగించాలంటే చేతిలోకి నీళ్లు తీసుకొని త్రాగిస్తున్నారు. నీళ్ల గ్లాసులను బయటకు తీసుక వెళ్ళకుండా త్రాడుతోనైనా, చైన్తోనైనా, కట్టి ఫ్రిజ్ వద్ద ఏర్పాటు చేయకపోవడం అధికారులు మరిచారని ప్రయాణికులు అంటున్నారు. అధికారుల ఆర్భాటం బాగుంది కానీ నీళ్ళు త్రాగేందుకు ఏర్పాటు చేయక ఇబ్బందికరంగా మారిందని ప్రయాణకులు అంటున్నారు. అధికారులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Next Story






