- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైంసాలో ఘనంగా ఊరేగిన పాంఢ్రీ మైసమ్మ బోనాలు..!
అమ్మ చల్లంగా దీవించు అంటూ..! ఆదివారం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ పాంఢ్రీ మైసమ్మ దేవాలయంలోని అమ్మవారికి కాలనీవాసులు బోనాలు సమర్పించారు..

X
దిశ, భైంసా: అమ్మ చల్లంగా దీవించు అంటూ..! ఆదివారం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ పాంఢ్రీ మైసమ్మ దేవాలయంలోని అమ్మవారికి కాలనీవాసులు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది. కాలనీలో ఉన్న ప్రతి గడప గడప బోనాలను ఊరేగింపుగా తీసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
కోరిన కోరికలు తీర్చే పేరున్న మైసమ్మను భక్తులు దర్శనం చేసుకుని కానుకలు సమర్పించుకున్నారు. ఈ బోనాల పండుగలో కిషన్ గల్లి సర్పంచ్ అల్లకొండ సాయినాథ్, ఉపసర్పంచ్ గట్టు, కోశాధికారి కాశీనాథ్,కౌన్సిలర్ గాలిరవి గల్లీ వాసులు, మహిళలు పలువురు హాజరయ్యారు.
Next Story






