గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

by Bhanu |

మండలంలోని ఇంధనపల్లి పంచాయతీ కార్యదర్శి ఎర్రోజుల చంద్రమౌళి(58) బుదవారం గుండెపోటు తో మృతి సంఘటన మండలంలో చోటుచేసుకుంది.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి
X

దిశ, జన్నారం : మండలంలోని ఇంధనపల్లి పంచాయతీ కార్యదర్శి ఎర్రోజుల చంద్రమౌళి(58) బుదవారం గుండెపోటు తో మృతి సంఘటన మండలంలో చోటుచేసుకుంది. చంద్రమౌళి గత రెండు సంవత్సరాల క్రితం నుండి ఇంధనపెళ్లి పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. గ్రామపంచాయతిలలో సర్పంచ్ లేకపోవడంతో పని భారం పెరగడం గ్రామపంచాయతిలకు గత సంవత్సరం నుండి ఎటువంటి నిధులు రాకపోవడంతో తన సొంత డబ్బులు ఖర్చుపెట్టడం తో తనకు రావాల్సిన బిల్లులు నుంచి పెండింగ్లో ఉండడంవల్ల ఆర్థిక ఇబ్బందుల తాళలేక ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. గ్రామ ప్రజలతో అధికారులతో చంద్రమౌళి కలివిడిగా ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, కుమారుడు ఉదయ్, కూతురు మేఘన లు ఉన్నారు.

Next Story