ఏసీబీకి ప‌ట్టుబ‌డిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

by Ratna Kumari |

దిశ‌, క‌న్నెప‌ల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలో పని చేసే గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. గత రెండు నెలల క్రితమే ఏసీబీ అధికారులకు

ఏసీబీకి ప‌ట్టుబ‌డిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి
X

దిశ‌, క‌న్నెప‌ల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలో పని చేసే గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. గత రెండు నెలల క్రితమే ఏసీబీ అధికారులకు ఓ ఉపాధి హామీ పథకంలో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్ చిక్కాడు. వరుసగా కన్నెపల్లి మండలంలో పని చేస్తున్న అవినీతి అధికారులు ఏసీబీ దాడులకు చిక్కడం స్థానిక అధికారులలో కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కన్నెపల్లి గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడి నుంచి కన్నెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజకుమార్ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్న క్రమంలో మూడో దశ బిల్లు కొరకు పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా లబ్ధిదారుడు ఐదు వేల రూపాయలు చెల్లిస్తానని చెప్పి శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి లో అంబేద్కర్ చౌరస్తా ప్రాంతంలో లబ్ధిదారు నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి లేదా 9154388963 కి సమాచారం అందించాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి లో కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శి రాజకుమార్ ఏసీబీకి పట్టుబడటంతో మండలంలో పని చేస్తున్న పలు శాఖలోని అవినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. గత రెండు నెలల క్రితం ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఓ టెక్నికల్ పశువుల పాక షెడ్డు బిల్లు చెల్లింపు విషయంలో లబ్ధిదారుడి ఇంటి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు పట్టుబడిన ఘటన మరువకముందే పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టు పడటం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఏ శాఖలో ఏం జరుగుతుందో అని అధికారులంతా ఒక్కసారిగా అయోమయానికి గురవుతున్నారు. మొదటి నుంచి మండల కేంద్రంలో పని చేసే అధికారులు నిర్లక్ష్య వైఖరి, విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నప్పటికీ శుక్రవారం ఏసీబీ దాడులు జరగడంతో మండలంలోని వివిధ శాఖలోని అధికారులంతా ఉలిక్కిపదుతున్నారు.

Next Story