పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్రంలో మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి

పంచాయతీ ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించాలి : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్రంలో మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో,నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సూచించారు.ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని తెలిపారు. మతపరమైన సమస్యలు,శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.ఎన్నికల విధులలో సాయుధ సిబ్బందిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలలో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేస్తూ ఉండాలి అన్నారు, ప్రజలలో నమ్మకం పెంచేందుకు మరియు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల ధైర్యం నింపాలన్నారు.సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల నమ్మక పెంచాలి అని తెలిపారు. జిల్లావ్యాప్తంగా తట్టి పోలీస్ యాక్ట్ అమలు చేయాలని తెలిపారు.గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అలాంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు మల్టీ జోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి,ఐజి పీ&ఎల్ ఎం రమేష్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలు అఖిల్ మహాజన్,జానకి షర్మిల,నితికా పంత్,మంచిర్యాల్ ఏసీపీ ఎగ్గడి భాస్కర్,అదనపు ఎస్పీలు కాజల్ సింగ్,బి సురేందర్ రావు,ఏఎస్పి చిత్తరంజన్,పి మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్,పోతారం శ్రీనివాస్,ఎల్ జీవన్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధికారులు సీఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story