- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా టార్గెట్.. నీట్ నిర్మల్..!
నీట్ నిర్మల్.. స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ కావ్య గణేష్ చక్రవర్తి అన్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : నీట్ నిర్మల్.. స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ కావ్య గణేష్ చక్రవర్తి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళికస నిర్మల్ పట్టణంలో రెండవరోజు కొనసాగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిలు సిబ్బందితో కలిసి 26,28 వార్డుల్లో పర్యటించారు. పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. తాము చేపట్టిన స్వచ్ఛ నిర్మల్ పట్టణం సంకల్పానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. దోమల నివారణకు మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుందని, ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో నీటి నిలకడ లేకుండా చూసుకోని పరిశుభ్రతకు పాటుపడాలన్నారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించాద్దని అధికారులకు సూచించారు. కాలనీలలో ఉన్న సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, కౌన్సిలర్లు గోపు గోపి, ఆకుల రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






