- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండండి : కలెక్టర్ అభిలాష అభినవ్
ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

దిశ, నిర్మల్ ప్రతినిధి : ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవం, హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లే వాహన శ్రేణి, సభ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవం, బహిరంగ సభ ప్రాంగణాల్లో త్రాగునీరు, టెంట్లు, షామియానాలు, సరిపడినన్ని కుర్చీలు, సౌండ్ సిస్టమ్, వేదిక తదితర ఏర్పాట్లు సమర్ధవంతంగా చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






