బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీల రాజకీయం...

by Ratna Kumari |

దిశ, బైంసా : బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయం చేస్తున్నారని, ముధోల్ తాలూకా మున్నూరు కాపు బీసీ నాయకులు ఆరోపించారు

బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీల రాజకీయం...
X

దిశ, బైంసా : బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ఓసీలు రాజకీయం చేస్తున్నారని, ముధోల్ తాలూకా మున్నూరు కాపు బీసీ నాయకులు ఆరోపించారు. శనివారం పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముధోల్ తాలూకా గొల్లమాడ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయి అంటూ ఓసీ నాయకులు విలాస్ గాదెవార్, పడకండి రమాదేవి బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారుల సమక్షంలోనే విజేతను నిర్ణయించారని, మళ్లీ అవకతవకలు జరగాయని అనడం బీసీల ఐక్యతను దెబ్బతీయడానికే అన్నారు. ఈ సమావేశంలో వై.మల్లేష్, ఆర్.పోశెట్టి, ఏ.సంజీవ్,నరసయ్య,దేవిదాస్ ఉన్నారు.

Next Story