‘దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు’: మార్కెట్ కమిటీ చైర్మన్

by Kodari Anjali |

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లబ్ధి పొందాలని, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి అన్నారు.

‘దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు’: మార్కెట్ కమిటీ చైర్మన్
X

దిశ, మామడ: రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లబ్ధి పొందాలని, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని న్యూ సాంగ్వి, ఆదర్శనగర్ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకొని 2389 రూపాయలు మద్దతు ధర పొందాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అశ్విన్ రెడ్డి, ముత్యం రెడ్డి, లక్ష్మి ఏఎంసి డైరెక్టర్ వకీల్, పిఎసిఎస్ సీఈఓ రాజేందర్, నాయకులు గంగారెడ్డి, వికాస్ రెడ్డి, ప్రశాంత్, లింగారెడ్డి, నితిన్ రెడ్డి, ప్రశాంత్, భోజన్న, రవి, రైతులు పాల్గొన్నారు.

Next Story