నిర్మ‌ల్ డిగ్రీ క‌ళాశాల అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌రేట్

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సరితా రాణి PHD పట్టా పొందారు. కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని

నిర్మ‌ల్ డిగ్రీ క‌ళాశాల అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌రేట్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సరితా రాణి PHD పట్టా పొందారు. కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆమె మహారాష్ట్రలోని స్వామి రామానంద తీర్థ మరత్వాడా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ డీకే స్వామి సారధ్యంలో సరిత రాణి రసాయన శాస్త్రంలో సింథసిస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బయాలజికల్ యాక్టివిటీస్ ఆఫ్ స్కిఫ్ బేసిస్ అండ్ దేర్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్ స్" అనే అంశంపై PHD పరిశోధన చేశారు. సరిత రాణి సమర్పించిన పరిశోధన పత్రం డాక్టరేట్ కు ఎంపికైంది. ఈ మేరకు ఆమెకు పట్టా అందజేశారు. డాక్టర్ అవార్డు పొందిన డాక్టర్ సరిత రాణిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు సహా స్థానికులు అభినందించారు.

Next Story