బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్ కేసులో ట్విస్ట్.. పోలీసులు చెబుతోంది నిజమేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-25 10:44:28  IST  )

బాసర ట్రిపుల్ ఐటీలో వసంత ఆత్మహత్య కేసులో కొత్తకోణం తెరపైకి వచ్చింది. ఆమెకు చివరిగా వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్ కేసులో ట్విస్ట్.. పోలీసులు చెబుతోంది నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతోన్న వసంత (19) అనే విద్యార్థిని బాలికల హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వసంత ఆత్మహత్యకు చదువుల ఒత్తిడి కారణమా? లేక కుటుంబ సమస్యలా? తోటి విద్యార్థులంతా ఆందోళన చెందుతున్న సమయంలో పోలీసులు కొత్త విషయం చెప్పడంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆత్మహత్యకు సరైన కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ వీసీ ఛాంబర్ ను ముట్టడించారు. దీంతో కళాశాల ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వసంత ఆత్మహత్య కేసులో పోలీసులు అనుమానించిన కోణమేంటి?

వసంత ఆత్మహత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. గణేష్ అనే యువకుడితో వసంత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. నిన్న (మంగళవారం) రాత్రి గణేష్ నుంచి ఫోన్ కాల్ రాగా.. ఆ తర్వాత ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్, వాట్సప్ బ్లాక్ చేసినట్లు గుర్తించారు. ట్విస్ట్ ఏంటంటే.. గణేష్ నిన్న రాత్రే హైదరాబాద్ లోని ఓ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గణేష్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న వసంత.. నిన్న రాత్రే కత్తితో చేతికి, మెడకు గాట్లు పెట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆ తర్వాత యమున గర్ల్స్ హాస్టల్లో తన గదిలో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిపారు. అయితే విద్యార్థులు మాత్రం.. వసంత ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేతులు, మెడపై గాయాలుండటంతో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, వీసీ మాత్రం వసంత మనోవేదనతోనే చనిపోయినట్లు చెప్తున్నారు. కాగా.. గణేష్ చివరిగా చేసిన ఫోన్ కాల్ లో గణేష్ ఏం చెప్పాడు? ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణమా? బంధువులే అయినా ఎందుకు దూరం పెట్టాలనుకున్నారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story