మహా పూజ తో ప్రారంభమైన నాగోబా జాతర

by Web Desk |
మహా పూజ తో ప్రారంభమైన నాగోబా జాతర
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లో ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సోమవారం రాత్రి మహా పూజలు మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహించారు. ఈ మహా పూజకు ముందు సోమవారం ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారి సంప్రదాయ రీతిలో ముందుగా వారు బస చేసిన మర్రి చెట్టు నుండి పవిత్రమైన గంగా జలాలతో సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. పుష్య మాసం అమావాస్య ని పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గోదావరి నది ఆస్తి నా మడుగు నుండి తీసుకు వచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయం శుద్ధిచేసి నాగోబా కు జలాభిషేకం చేశారు. ఆ తర్వాత మహా పూజ ను నిర్వహించారు.

ఈ పూజ అనంతరం వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. అనంతరం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు(బేటింగ్) పరిచయ కార్యక్రమంలో ముందుగా కొత్తగా వచ్చిన కోడళ్లను మెస్రం వంశం మహిళలు నాగోబా ఆలయం పతి దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి దేవతలను చూపెట్టారు. మెస్రం వంశం పెద్దల ఆశీర్వాదం తీసుకున్న వారు పూర్తిగా వారి వంశంలో చేరినట్టు భావిస్తారు. మహా పూజలతో ప్రారంభమైన నాగోబా జాతర ఈ నెల 4 వరకు అధికారికంగా.. 8 వరకు అనధికారికంగా కొనసాగనుంది అని దేవాదాయ శాఖ ఈ ఓ తెలిపారు.






Next Story

Most Viewed