- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక విజన్ తో ముందుకెళ్లాలి : ఎమ్మెల్యే
అభ్యర్థులు ఎవరైనా ఒక విజన్ తో ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు

దిశ, ఉట్నూర్ : అభ్యర్థులు ఎవరైనా ఒక విజన్ తో ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగ సాధనకు ఉచిత కోచింగ్ ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉట్నూర్ ఎఫ్ డివో అరవింద్, ఐటీడీఏ బీఈడీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ప్రముఖ వ్యక్త విజయ్ బాబుతో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో నిరంతరంగా కష్టపడాలన్నారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉన్నప్పుడే జాబ్ ఎంపిక అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పోటీ ప్రపంచంలో మరింత కష్టపడాలన్నారు. తల్లిదండ్రుల కష్టాలను, ఆశయాలను నిలబెట్టెల అభ్యర్థులు సిద్ధం కావాలని, ట్రైనింగ్ లో చెప్పే విషయాలను శ్రద్ధగా విని రాసుకొని, రివిజన్ చేయాలని సూచించారు. ఇలాంటి అవకాశాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టీ ప్రతాప్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, అధ్యాపకులు ముజీబ్, స్వామి, నర్సింగ్ రావ్, రాణి ఇతరులు ఉన్నారు.






