- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయంలోనే నిరాహార దీక్షకు దిగుతా : ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
by Muthe.Rajitha |
బీజేపీ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(Mudhol MLA Rama Rao Patel) సంచలన ప్రకటన చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(Mudhol MLA Rama Rao Patel) సంచలన ప్రకటన చేసారు. బాసర ఆలయాన్ని(Basara temple) అభివృద్ధి చేయకపోతే ఆలయంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వర్కింగ్ ఇచ్చారు. కాగా నేడు రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అధ్యక్షతన జరిగిన బాసర ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఆలయ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రి సమక్షంలోనే అధికారులను నిలదీశారు.
ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని, తానూ బిచ్ఛం ఎత్తుకొని అయినా వచ్చిన డబ్బులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. దీపావళిలోపు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోతే గర్భాలయంలోని నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
Next Story






