- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల కోసం బైంసా పేరు వాడొద్దు.. ఎంపీకి బీఆర్ఎస్ నేత వార్నింగ్..!
దిశ, భైంసా : భైంసా బాగుందని..! రాజకీయాల లబ్ధి కోసమే నాయకులు బైంసా పేరు వాడడం జరుగుతుందని బీఆర్ఎస్ ముధోల్ తాలూకా సమన్వయ నాయకులు విలాస్ గాదేవార్ సోషల్

దిశ, భైంసా : భైంసా బాగుందని.. రాజకీయాల లబ్ధి కోసమే నాయకులు బైంసా పేరు వాడడం జరుగుతుందని బీఆర్ఎస్ ముధోల్ తాలూకా సమన్వయ నాయకులు విలాస్ గాదేవార్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్టును రిలీజ్ చేశారు. ఇటీవల మెదక్ ఎం.పీ రఘునందన్ రావు ఓ సందర్భంలో కాంగ్రెస్, ఎం.ఐ.ఎం ఒకటేనని జూబ్లీహిల్స్ బైపోల్ లో బీజేపీ ఓటు వేయకపోతే మరో బైoసాలా తయారవుతుందన్న వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఖండించారు. బండి సంజయ్, రఘునందన్ రావు ఇలా ప్రతి ఒక్కరూ బైంసా పేరు చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్నారని.. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మీరు ఇలాంటివి కాకుండా తాలూకాలో ఉన్నటువంటి బాసర అమ్మవారికి నిధులు తెప్పించి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికాడు. ఇక్కడి ప్రజలు సుఖoగా, శాంతియుతంగా ఉన్నారని, ఎక్కడో ఉన్న మీరు...మీ పబ్బం గడుపుకోవడానికి బైంసా పేరు వాడొద్దని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.






