- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంద ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది.

దిశ, నేరేడిగొండ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్న జొన్న, మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. పంట పొలాలలో ఉన్న మోటార్లకు ఉన్న కేసింగ్ పైపులు, వైర్లు, పదుల సంఖ్యలో పైపులు కాలిపోవడంతో లక్షల్లో ఆస్థి నష్టం సంభవించిందని బాధిత రైతులు పేర్కొన్నారు. వ్యవసాయ భూములలో ఉన్న పంటలు కాలిపోతున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆలుగాలం కష్టపడి చేతికి వచ్చిన జొన్న, మొక్క జొన్న పంటలు రైతుల కండ్ల ముందరే కాలిపోతుండడం తో రైతులు మరియు వారి కుటుంబికులు కన్నీటి పర్యాంతమవుతూ ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
రైతులు అధైర్యపడవద్దు.. అండగా ఉంటా : ఆడే గజేందర్
బోథ్ మండలం లోని కనుగుట్ట గ్రామంలో వంద ఎకరాలకు పైగా జొన్న, మొక్క జొన్న పంటలు ప్రమాదవ శాత్తు జరిగిన అగ్ని ప్రమాదం లో కాలి పోవడం బాధకరమని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని ముఖ్య మంత్రి కార్యాలయం, జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆడే గజేందర్ తెలిపారు.






