1800 కు పైగా నాటు కోళ్లు మృత్యువాత

by Ratna Kumari |

దాదాపు 1800 కి పైగా నాటుకోళ్లు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న క‌న్నెప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని వీరాపూర్ లో చోటు చేసుకుంది.

1800 కు పైగా నాటు కోళ్లు మృత్యువాత
X

దిశ‌, క‌న్నెప‌ల్లి : దాదాపు 1800 కి పైగా నాటుకోళ్లు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న క‌న్నెప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని వీరాపూర్ లో చోటు చేసుకుంది. క‌న్నెప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని వీరాపూర్ చెందిన సొండ్ల చందు మేర కోళ్ల ఫారంలోని 1800 కి పై గా నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. నాటు కోళ్ల పెంపకానికి ప్రత్యేక షెడ్డు నిర్మించి 2000 నాటు కోళ్లు పెంచుతున్నారు. అయితే సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు దాదాపు 1800 పైగా నాటు కోళ్లు మృతి చెందాయని చందు మేర తెలిపారు. నాటు కోళ్లను రెండు నెల క్రితం సిద్దిపేట నుండి తీసుకువచ్చి తన కోళ్ల ఫారం లో పెంచుతున్నాడు. ఇదే సమయంలో ఆకస్మాత్తుగా మృత్యువాత పడటంతో దాదాపు పది లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ విషయంపై వెటర్నటి అసిస్టెంట్ సర్జన్ శ్వేతను వివరణ కోరగా ఈ కోళ్లు శ్వాసకోస వ్యాధి ఇబ్బందులతో మృతి చెంది ఉంటాయని ఆమె తెలిపారు.

Next Story