ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

by Ratna Kumari |

దిశ, ఇంద్రవెల్లి : ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్ తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న

ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
X

దిశ, ఇంద్రవెల్లి : ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దు అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్ తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రసాయన ఎరువుల, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామల దేవీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్, పీఏసీఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, వ్యవసాయ అధికారి గణేశ్, తహసీల్దార్ ప్రవీణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జహీర్, మార్క ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.

Next Story