మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి.. బోథ్ ఎమ్మెల్యే

by Disha Web Desk 20 |
మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి.. బోథ్ ఎమ్మెల్యే
X

దిశ, ఇచ్చోడ : నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించుకున్న తెలంగాణలో మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామానికి మంజూరైన తారురోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కనీస రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు కూడా బీటీ రోడ్లను మంజూరు చేస్తున్న సీఎం కేసీర్ ఆలోచన విధానం చాలా గొప్పదన్నారు.

నియోజక వర్గంలో అన్ని గిరిజన గ్రామాలకు తారురోడ్లు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యావతి రాథోడ్ ను కలిసి సమస్యను వివరించామని ఆయన చెప్పారు. దశల వారీగా రోడ్ల మంజూరుకు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే తారు రోడ్ల పనులను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే వివరించసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాయి, స్థానిక మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed